శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
- షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
- అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
- ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
- నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
- నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును.
- నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
- నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
- మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
- నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
- నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.
- నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.