శ్రీ మాణిక ప్రభుజీ
శ్రీమాణిక..జయమాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..
భక్త కార్య కల్పద్రుమ గురుసార్వభౌమ..శ్రీ మద్రాజాధిరాజ యోగిమహారాజ,త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత..సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్‌కీ జై…
శ్రీ మాణిక ప్రభుజీ/ మాణిక్ ప్రభు / మాణిక్య ప్రభువు గా పిలువబడే ‘మాణికరత్న నాయకుడు’ దత్తాత్రేయుని మొట్ట మొదటి అంశావతారము (మొట్ట మొదటి దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: శ్రీపాద శ్రీ వల్లభ, రెండవ దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: శ్రీ నృసింహ సరస్వతి, మూడవ దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: స్వామి సమర్థ, అలాగే మొట్ట మొదటి దత్తాత్రేయ అంశావతారము: శ్రీ మాణిక ప్రభు, రెండవ దత్తాత్రేయ అంశావతారము: శ్రీ షిర్డీసాయి). ఈయనకు గల బిరుదు ‘భక్త కార్య కల్పద్రుమ’. బహుశా ఇటువంటి బిరుదు కలిగిన ఏకైక దత్తావతారం శ్రీ మాణిక ప్రభువే!.
వీరు చేసే పనులు, మాటలు సూటిగా దత్తతత్వాన్ని చూపేవిగా ఉంటాయి. వీరు చేసిన, చూపిన లీలలు ఉహకందనివిగా, కాలాతీతంగా ఉంటాయి. శ్రీ మాణిక ప్రభు 22-December-1817 మంగళవారం, ఈశ్వరనామ సంవత్సరంలో ‘దత్తజయంతి’ నాడు మనోహర నాయకుడు, బయాదేవి దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. వీరు పుట్టింది గుల్బర్గా దగ్గరగల ‘కళ్యాణి’ లో. వీరి చిన్నతనంలోనే (4వ ఏటా) తండ్రిని కోల్పోవడంవల్ల మేనమామ వద్ద పెరిగారు. పెద్దవాడవుతున్నా కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా అరణ్యాలవెంట తిరుగుతున్న ‘మాణిక’ని మామ మందలించడంతో, తను కట్టుకున్న కౌపీనాన్ని (గోచీ) కూడా విసర్జించి, మేనమామకు సాష్టాంగ నమస్కారంచేసి కళ్యాణి నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు.
ఆనాటి నుండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అద్భుత లీలలు ప్రదర్శిస్తూ, దత్తప్రవచనాలతో ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ, ఎన్నో విషమపరీక్షలు ఎదుర్కొంటూ, జీవన ప్రయాణం చేస్తూవచ్చారు.
ఒకనాడు వారు పల్లకిలో అడవి మార్గాన వస్తుండగా ఒకచోట అడవి తీగల మధ్యలో వారు కూర్చున్న పల్లకీ చిక్కుకుని ఎంతకీ కదలలేదు. బోయీల అడుగు ముందుకి పడలేదు. దానితో బోయీలలో భయం నెలకొంది. చుట్టూ దట్టమైన అరణ్యం, వన్యమృగాలు, పాములతో నిండివుంది. ఇది గమనించిన మాణిక ప్రభు పల్లకిని కిందికిదించమని చెప్పి, ఆయన పల్లకీ నుండి దిగీదిగగానే అక్కడే ఉన్న రెండు అతి పెద్ద బిల్వవృక్షాలు నిలువునా కాలి బూడిదైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయీలు మరింత భయభ్రాంతులవుతుండగా, మాణిక ప్రభు “ఇద్దరు బ్రహ్మరాక్షసులకి ముక్తి లభించింది” అని అన్నారు.
ఆ ప్రాంతం రెండు నదుల (విరజ మరియు గురుగంగ నదులు) సంగమ ప్రదేశం. అక్కడే ఒక గడ్డితో చేసిన కుటీరం ఏర్పాటుచేసుకుని జీవసమాధి పొందేవరుకు ఉండిపోయారు. కాల క్రమేణా మాణిక ప్రభు ఉన్న ఆ అటవీ ప్రాంతమే ‘మాణిక్ నగర్’ గా ప్రసిద్ధికెక్కింది .
మాణిక్ నగర్ ‘మణిచూల పర్వతం’ మీద గలదు. మాణిక్ నగర్ కు గల మరొక పేరు ‘వృషభాద్రి’. ఇక్కడే (మాణిక్ నగర్) మాణిక ప్రభు సంస్థానం (ఆలయం) ఉంది. సంస్థానం, దేవాలయంగా క్రీ.శ.1945వ సంవత్సరంలో కట్టబడినది. అప్పటినుండి మాణిక ప్రభు అక్కడే ఉండి అనేకానేక అద్భుతాలను చేసారు. మాణిక్ నగర్ కర్నాటక లోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ కు 2 KMs దూరంలో ఉంది.
శ్రీ మాణిక ప్రభువుల వారికి క్రీ.శ.1865వ సంవత్సరంలోనే మొట్ట మొదటి దేవాలయం హైదరాబాద్ లోని శంకరపల్లికి దగ్గరలో గల మొమిన్ పేట్ లో కట్టబడినది. శ్రీ మాణిక ప్రభువుల వారు స్వయంగా విచ్చేసిన దేవాలయమిది. వారి దేవాలయాన్ని వారే సందర్శించి ఆశ్చర్యపోయారట. ఆ దేవాలయ నిర్మాణకర్తలని ఎంతో అభినందించి,ఆశీర్వదించి సంతృప్తితో తిరిగి మాణిక్ నగర్ చేరారట.
భక్తుల యొక్క కష్టాలనూ, వ్యాధులనూ ‘పూలతో’ పోగొట్టడం వీరి ప్రత్యేకత. అందుకే శ్రీ మాణిక ప్రభుజీ వారి అన్ని చిత్రాలలో వారు ‘పువ్వు’ని పట్టుకునట్లుగా ఉంటుంది. మొట్ట మొదటి దత్త అంశావతారమైన శ్రీ మాణిక ప్రభుజీ వారికి, వారు జీవసమాధి పొందక మునుపే నిర్మించిన మొట్ట మొదటి దేవాలయము మనకు దగ్గరలోనే ‘మొమిన్ పేట్’ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ.1862 లో ప్రారంభించబడి క్రీ.శ.1865 లో పూర్తి చేయబడినది. క్రీ.శ.1865 లో శ్రీ మాణిక ప్రభుజీ వారు 28-నవంబర్-1865 సోమవారం మార్గశీర్షమాస శుద్ధ ఏకాదశి రోజు జీవసమాధి పొందుతారనగా దానికి సరిగ్గా ఒక నెల ముందు మాణిక్ నగర్ నుండి వచ్చి వారికి నిర్మించబడిన ఆలయంలో ఒక ‘దత్తగాదీ (Spiritual Seat)’ని స్థాపించి, వారు తరచుగా చేతి క్రింద పెట్టుకునే ‘దండాన్నీ’ మరియు ‘పాదముద్రల’ ను అక్కడ వదిలి ఎంతో సంతృప్తితో తిరిగి మాణిక్ నగర్ వెళ్లారు. శ్రీ మాణిక ప్రభుజీ వారు సైతం ఈ దేవాలయాన్ని సందర్శించి, అక్కడ గాదీనీ, పాదుకలను ప్రతిష్టించడం వల్ల దత్త భక్తులందరూ చూసితీరవలసిన ప్రదేశమిది.
శ్రీ మాణికప్రభువుల వారి ’గాదీ’ దేవాలయాలు (గాదీమందిర్ లు)
Adilabad – Elvi
Adilabad – Mhaisa
Adilabad – Mudhole
హైదరాబాద్ – Goulipura
హైదరాబాద్ – Jangli
హైదరాబాద్ – Karwan
హైదరాబాద్ – Keshavgiri
హైదరాబాద్ – Rahimpur
హైదరాబాద్ – Ramantapur
Secunderabad – Secunderabad
Kurnool – Malagveli (Andhra Pradesh)
Mahaboobnagar – Shadnagar
Medak – Alladurg
Medak – Andol
Medak – Babulgaon
Medak – Chelmeda
Medak – Daulatabad
Medak – Doppur
Medak – Eddu Mailaram
Medak – Ismailkhanpeth
Medak – Jogipeth
Medak – Karchal
Medak – Kohir
Medak – Krishnapur
Medak – Medak Town
Medak – Mubarakpur
Medak – Narayankhed
Medak – Nyalkal
Medak – Pattancheru
Medak – Ramtirtha
Medak – Sadashivpeth
Medak – Sangareddy
Medak – Shankarampeth
Medak – Tekmal
Medak – Togta
Medak – Vendikol
Medak – Zaheerabad
Medak – Zara Sangam
Nizamabad – Ali Sagar
Nizamabad – Bodhan
Nizamabad – Kaulas
Nizamabad – Kotgir
Nizamabad – Nizamabad Town
Nizamabad – Rudrur
Nizamabad – Zukkal
Rangareddy – Aloor
Rangareddy – Chevalla.
Rangareddy – Dhobipeth
Rangareddy – Mominpet
Rangareddy – Nawabpet
Rangareddy – Pargi
Rangareddy – Tormamdi
Warangal – Warangal Town
Belgaum – Madhalli
Bellary – Shridhargatta
Bidar – Agrahar
Bidar – Amrutkund
Bidar – Andur
Kalyan – Basava Kalyan
Bidar – Belkunda
Bidar – Bhalki
Near Bidar – Zarani Narsimha
Bidar – Bidar Town
Bidar – Chalakapur
Bidar – Chalki
Bidar – Chikhali
Bidar – Dhannur
Bidar Dist – Gotamgotti
Bidar – Hallikhd
Bidar -Janwada
Bidar – Khatakchincholi
Bidar – Khelgi
Bidar Dist – Ladwanti